Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ నాగేశ్వరరావు, బి రాము
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్ నాగేశ్వరరావు, బోయిన్పల్లి రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాన్ని శుక్రవారం హైదరాబాద్లోని మార్క్స్భవన్లో నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర నూతన అధ్యక్షులుగా ఓయూ పరిశోధక విద్యార్థి ఎస్ నాగేశ్వరరావు, కార్యదర్శిగా నారాయణపేట జిల్లాకు చెందిన బి రాము ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎ శరత్, రామకృష్ణ, కల్పన, స్వాతి, భాస్కర్, సహాయ కార్యదర్శులుగా బోయిన్పల్లి గణేష్, నరేందర్, ఆజాద్, పృథ్వీ, అనిల్, కోశాధికారిగా సాయిని ఎన్నుకున్నారు.