Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సమ్మె నోటీసు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈనెల 28,29 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించతలపెట్టినన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించిన సమ్మె నోటీసును విద్యాశాఖ కమిషనర్‌కు శుక్రవారం సమర్పించినట్టు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఇందులో మధ్యాహ్న భోజన కార్మికులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని... జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులను బానిసత్వంలోకి నెట్టే కార్మిక చట్టాల కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలు, ఇన్సూరెన్స్, బ్యాంకులు, బొగ్గు, రైల్వే, రక్షణ, ఇతర ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించొద్దని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.26 వేల కనీస వేతనాన్ని నిర్ణయించి అమలు చేయాలని కోరారు. కరోనా కాలంలో పాఠశాలలు బంద్‌లో ఉన్న కాలానికి కూడా మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాన్ని చెల్లించాలని రమ డిమాండ్ చేశారు.
బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సమ్మె నోటీసు...
మరోవైపు తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) కూడా కార్మికశాఖ కమిషనర్‌కు సమ్మె నోటీసును అందజేసింది. పారిశ్రామిక వివాదాల చట్టం 1947 సెక్షన్ 22, సబ్ సెక్షన్ (1)ను అనుసరించి నోటీసును అందజేస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ ఒక ప్రకటనలో తెలిపారు.