Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో విచ్చలవిడి మద్యం అమ్మకాలను నియంత్రించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. పేదల కష్టార్జితం మద్యంపాలు అవుతున్న దని ఆందోళన వ్యక్తం చేశారు. చీపు లిక్కర్ ధరలను తగ్గించాలని కోరారు. మాటలకు చేతలకు పొంతన లేకుండాపోయిందని విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీలో పద్దులపై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నీరాను ప్రోత్సహించడాన్ని ఆయన స్వాగతించారు.
తెల్ల రేషన్ దారులకు సరుకులు పెంచాలి : కాంగ్రెస్ సభ్యులు జగ్గారెడ్డి
రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డు దారులకు బియ్యం మాత్రమే ఇస్తున్నారనీ, ఆయిల్, చక్కెర, కిరోసిన్, కారం, ఉప్పు, పప్పు, చింతపండుతోపాటు ఇతర నిత్యవసర వస్తువులు కూడా ఇవ్వాలని కోరారు. శుక్రవారం సివిల్ సప్లరు పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.