Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోసమే ధరణి - మంత్రి వేముల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భూసమస్యల పరిష్కారం కోసమే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చామని శాససభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.రూ. 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు ధరణిలో నమోదయ్యాయని తెలిపారు. ధరణి ద్వారా పారదర్శకంగా సేవలు అందిస్తున్నామన్నారు. ఆ పోర్టల్ ఆధారంగానే రైతుబంధు ఇస్తున్నామని చెప్పారు. కేవలం 15 నిమిషాల్లోనే భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయనీ, రిజిస్ట్రేషన్ల ద్వారా 11 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తోందని తెలిపారు. 32 రకాల లావాదేవీలు ధరణి పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఏడేండ్ల్లలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి 18 లక్షల లావాదేవీలు జరిగాయని తెలిపారు. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపించిందనీ, హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు రిలీఫ్ ఫండ్ ఇవ్వడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.