Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హరితహారంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 4.06 కోట్ల తాటి, ఈత మొక్కలను నాటామని శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కల్లు ఆయుర్వేద పానీయమనీ, నీరా చాలా గొప్పదని చెప్పారు. గీత కార్మికులు చనిపోతే ఆయా కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ఐదు రోజుల్లో అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గీత కార్మికుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బకాయిలన్నీ మాఫీ చేశామని వివరించారు. వృత్తి దారులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైన్ షాపుల్లో గౌడ కులస్తులకు రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. గత పాలకులు కల్లు గీత వృత్తిని అవమానించారనీ, ఆర్థికంగా నిలదొక్కుకోకుండా అడ్డుకున్నారని విమర్శించారు.