Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలోని మైనార్టీ గురుకులాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 5, 6, 7, 8 తరగతులు, ఇంటర్ ప్రవేశాల కోసం షెడ్యూల్ను టీఎంఆర్ఈఐఎస్ శుక్రవారం విడుదల చేసింది. ఏప్రిల్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. మే 9న మైనార్టీ గురుకులాల ఐదో తరగతి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. మే పదో తేదీన 6, 7, 8 తరగతుల ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఆ నెల 21న ఇంటర్ ప్రవేశాల పరీక్షను నిర్వహించనున్నారు.