Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు : పోతినేని సుదర్శన్రావు
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతాంగానికి నిధులు కేటాయించకుండా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు ఆరోపించారు.
శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంచికంటి భవన్లో జరిగిన ఆ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో పోతినేని మాట్లాడారు. ఈ రాష్ట్రంలో రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర బడ్జెట్లో రైతాంగానికి రూ.24 వేల కోట్లు కేటాయించడం సరికాదని, రైతులకు సంబంధించిన అన్ని రకాల రంగాలను కలుపుకొని రూ.50 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయకుండా అనేకసార్లు మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రుణాలు మాఫీ చేసి, పంటల వారీగా కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చి వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని తెలిపారు. సహకార సంఘం ఆధ్వర్యంలో రైతుల లోన్లు జప్తు చేస్తున్నారని, వాటిని వెంటనే నిలుపుదల చేయాలని, లేని పక్షంలో రైతు ఆందోళన చేెపడ తామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని అయిలయ్య, జిల్లా కార్యదర్శి కున్సోత్ ధర్మా, రాష్ట్ర నాయకులు కె.పిల్లయ్య, బి.కుమారి, జిల్లా నాయకులు అన్నవరపు సత్యనారాయణ, డి.లక్ష్మినారాయణ, బి.ధర్మా, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.