Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతినిధి బృందానికి సీపీఐ (ఎం) హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కు సంబంధించిన సమస్యలను పార్లమెంటులో లేవనెత్తేందుకు వీలుగా తమ పార్టీ ఎంపీలకు తెలుపుతామని సీపీఐ (ఎం) హామీనిచ్చింది. సీసీఐ సాధన పోరాట కమిటీ బృందం శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య, సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి, నాయకులు బండారు రవికుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ బృందంలో సీసీఐ సాధన పోరాట కమిటీ కన్వీనర్ బండి దత్తాత్రి తదితరులున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమ పోరాటానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు వీలుగా అన్ని పార్టీలనూ కలుస్తున్నామని తెలిపారు. సీసీఐ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే విధంగా సీపీఐ (ఎం) ఎంపీలకు విజ్ఞప్తి చేయాలని కోరారు. కమిటీ నాయకుడు విజ్జగిరి నారాయణ మాట్లాడుతూ... ఇప్పుడు చేస్తున్న పోరాటమంతా సీపీఐ (ఎం) చొరవతోనే ప్రారంభమైందని గుర్తు చేశారు.