Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి ప్రయివేటీకరణను అడ్డుకోవాలి: మీడియాపాయింట్లో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి సంస్థలకు సంబంధించి నైని కోల్ బ్లాక్ టెండర్ ప్రక్రియ సక్రమంగా జరగలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపిం చారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. సింగరేణిని ప్రయివేట్ సంస్థలకు కేటాయించొద్దం టూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అసెంబ్లీలో మాట్లాడినందుకు మంత్రి జగదీష్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగడమేంటని ప్రశ్నించారు. కోల్ బ్లాక్ టెండర్లను పారదర్శంగా నిర్ణయించాలని కోరితే మంత్రికి కోపం ఎందుకు వస్తున్నదో అర్థం కావటం లేదన్నారు. తెలంగాణ కోసం తాను వ్యాపారాలు నష్టపోయానని చెప్పారు. మంత్రి పదవి వదులుకున్నాని తెలిపారు. కమిషన్ల కోసమే ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైన్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ను ఎవరు దోచుకుంటున్నరో ప్రజలు చూస్తున్నారన్నారని తెలిపారు. మూడో సారి మళ్లీ అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. 2014 ముందు జగదీశ్వర్ రెడ్డి ఆస్తి ఎంత? ఇప్పుడు ఎంతో చెప్పాలని నిలదీశారు. ''మా ఆస్తులు దానధర్మాలు చేసి, ఉద్యమంలో ఖర్చు చేశాం...మీ కుట్రలు కుతంత్రాలు బయటపెడ్తాం. నేను ఈ రోజైన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. నైని కోల్ మైన్ విషయంలో అక్రమాలు జరిగాయి.. అటు బీజేపీని ఇటు కాంగ్రెస్‌ను తిడుతారు.. దొంగ పనులు చేసుకుంటా'' అంటూ ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో మైకు ఇవ్వనంత మాత్రాన తమ గొంతు మూగబోదన్నారు. ప్రగతి భవన్ గోడలను బద్దలు కొడతామని హెచ్చరించారు.