Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్
- అంబేద్కర్ విగ్రహ పనుల పరిశీలన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పనులను మంత్రులు, ఎమ్మెల్యేలు శుక్రవారం పరిశీలించారు,పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రాభివృద్ధినీ, ప్రజలబాగోగుల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రతి విషయంలో అనవసర రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. పెద్ద ఎత్తున తమ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడితే ప్రశంసించకపోగా విమర్శలకు దిగడం తగదన్నారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాట్ల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కానీ..బీజేపీ నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. విగ్రహంతో పాటు మ్యూజియం,ధ్యాన మందిరం, గ్రంథాలయం, సమావేశ మందిరాలు, ఫోటో గ్యాలరీ, క్యాంటిన్, అతిథుల కోసం గదులు, టాయిలెట్ల నిర్మాణం జరుగుతున్నాయని చెప్పారు. సువిశాలమైన పార్కింగ్తో పాటు పచ్చదనంతో పరిసరాలను సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతు న్నామని తెలిపారు. మంత్రుల వెంట ఎమ్మెల్యేలు టి.రాజయ్య, మెతుకు ఆనంద్, హన్మంతు షిండే, శంకర్ నాయక్,చిన్నం దుర్గయ్య,ఆరూరి రమేష్,కోరుకంటి చందర్, క్రాంతి కిరణ్, రవిశంకర్, రేఖా నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తదితరులు ఉన్నారు.