Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని కార్మికులకు పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్టు టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తెలిపింది. ఈ మేరకు జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి, కో చైర్మెన్ కే హన్మంతు, కన్వీనర్ వీఎస్ రావు, కో కన్వీనర్ ఎస్ సురేష్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో సమ్మె నోటీసు ఇచ్చారు. రెండ్రోజుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొంటున్నట్టు పేర్కొన్నారు. సమ్మెనోటీసుతో పాటు 18 డిమాండ్ల అనుబంధాన్ని కూడా అందచేశారు. కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కోడ్ల ఏర్పాటు, టూరిస్టు పర్మిట్లను రద్దు చేయాలనీ, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను నిలిపేయాలనీ, ఆర్టీసీలపై పన్నుల భారం తగ్గించాలనే పలు డిమాండ్లు ఆ అనుబంధంలో ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులు ఈ రెండ్రోజుల సమ్మెలో సంఘాలకు అతీతంగా పాల్గొనాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.