Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లింబాద్రికి జేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులనూ రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ కాంట్రాక్టు టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మెన్ ఎం రామేశ్వర్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రిని శుక్రవారం హైదరాబాద్లో జేఏసీ కలిసి వినతిపత్రం సమర్పించారు. పీఆర్సీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు 30 ఫిట్మెంట్ను కాంట్రాక్టు ఉద్యోగులకూ వర్తింపచేశారని గుర్తు చేశారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకూ 30 శాతం వేతనాలను పెంచాలని కోరారు. ఈ అంశాలపై ప్రభుత్వంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వెంకటేశ్వర్లు, తిరుపతి, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.