Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్‌తో జగ్గారెడ్డి కరచాలనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇటీవల కాలంలో పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇద్దరు నేతలు పరస్పరం పలకరించుకున్నారు. శాసనసభ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేవంత్‌రెడ్డి ఎదురుపడగానే జగ్గారెడ్డి ఆయన్ను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా కరచాలనం చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం ఇద్దరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 20 నిమిషాలకుపైగా వారి సమావేశం జరిగింది. ఆ తర్వాత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో ఏం మాట్లాడుకున్నామనే విషయాన్ని బహిర్గతం చేయబోమని చెప్పారు. గత కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరు నేతల వ్యవహార శైలిపై జగ్గారెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీని సైతం వీడుతానని ప్రకటించారు. ఇటీవల మెదక్ జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటనపైనా ఆయన విమర్శలు చేశారు. జిల్లా పర్యటనకు వస్తున్నట్టు తనకు సమాచారం కూడా లేదన్నారు. ఇలా చాలా సార్లు అవమానం జరిగిందంటూ కొద్దిరోజుల క్రితం సీఎల్పీ సమావేశం సందర్భంగా భట్టి విక్రమార్క తదితరులతో చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్‌రెడ్డిని జగ్గారెడ్డి ఆత్మీయంగా పలకరించుకోవడం ఆసక్తిగా మారింది.