Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని పీయూసీ చైర్మెన్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. జనరల్ చెకప్ కోసం సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళితే, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి ఆస్పత్రికి వెళ్లారంటూ రాజ్ గోపాల్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎవరు గెలిచినా, ఓడినా తమ పార్టీకి ఎలాంటి నష్టం ఉండబోదన్నారు. రాజ్ గోపాల్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గంలో 95 శాతం మంది కేసీఆర్ అభిమానులేననీ, ఇలాగే నోరు పారేసుకుంటే వారు ఆయన సంగతి చూస్తారని హెచ్చరించారు. కేసీఆర్ అంటే ఒక చరిత్ర అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ముందు, కేసీఆర్ తర్వాత అంటూ చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. భావితరాలకు ఆయన దార్శనీకతను తెలిపేలా పాఠ్యపుస్తకాల్లో చేర్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.