Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ బీటీంగా ఎంఐఎం : మధుయాష్కీగౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పంజాబ్ ఓటమితో గుణపాఠాలు నేర్చుకోవాలనీ, కలిసికట్టుగా పని చేద్దామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ సూచించారు. ఆరాష్ట్రంలో ఓటమి తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చాలా విషయాలను నేర్చుకోవాలన్నారు. అంతర్గత గొడవలను పక్కన పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకరావాలని కోరారు. దేశంలో బీజేపీ కుల,మత, ప్రాంతీయ ప్రాతిపదికన రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. మోడీ నిర్మాతగా ప్రశాంత కిషోర్ దర్శకత్వంలో సీఎం కేసీఆర్ నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి బీ టీంగా ఎంఐఎం పని చేస్తున్నదని విమర్శించారు. శనివారం హైరదాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈనెల 14 నుంచి భూదాన్ పోచంపల్లిలో ప్రారంభం కానున్న సర్వోదయ పాదయాత్ర, కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల ఖాళీల ప్రకటన, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఆదివారం కొల్లాపూర్‌లో జరగనున్న 'మన ఊరు- మన పోరు' బహిరంగసభ, డిజిటల్ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి మధుయాష్కీ గౌడ్ విలేకర్లతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కార్యకర్తలను నిరుత్సాహ పడకూడదని తెలిపారు. ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయాన్ని టీఏంసీ లాంటి పార్టీలు దెబ్బతీశాయని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలుపు కోసం కేసీఆర్ కషి చేశారని గుర్తు చేశారు.