Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనసభ సోమవారానికి వాయిదా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాసనసభలో శనివారం పలు పద్దులపై చర్చ కొనసాగింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, కేటీఆర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి... వాటిపై సభ్యులు లేవనెత్తిన అంశాలకు వివరణలిచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ క్రమంలో రాత్రి 10.50 వరకూ సభ కొనసాగి, ఆ తర్వాత వాయిదా పడింది. తిరిగి సోమవారం ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశం కానుంది.