Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ శనివారం మరణించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన మృతికి సంతాపం తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కతిని ఆయన తన పాట ద్వారా అజరామరంగా నిలిపారని అన్నారు. తెలంగాణ సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటు అనీ, పాటల రచయితగా, తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సష్టించిన తెలంగాణకు చెందిన వరంగల్ బిడ్డ కందికొండ అని స్మరించారు. ఆయన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసిందనీ, అయినా ఫలించక పోవడం దురదష్టమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.