Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు బండి సంజయ్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు ప్రతి నియోజకవర్గానికో స్టడీసర్కిల్ను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. మారుమూల గ్రామాల నుంచి శిక్షణ కోసం జిల్లా కేంద్రాలకు రావడం నిరుద్యోగ యువతకు వ్యయప్రయాసలతో కూడిన అంశమని పేర్కొన్నారు. ఆ కోచింగ్ కేంద్రాలలో శిక్షణ పొందే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా అల్పాహారం,భోజన,రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు.ప్రయివేటు కోచింగ్ సెంటర్లలో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీల ద్వారా ఏర్పాటు చేసే కోచింగ్ సెంటర్ల వల్ల అభ్యర్థుల్లో రాగద్వేషాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో టీశాట్, ప్రభుత్వ స్టడీ సర్కిల్స్, కోచింగ్ కేంద్రాల ద్వారానే నిరుద్యోగ యువతకు శిక్షణనివ్వాలని విన్నవించారు. ప్రతిజిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. నిరుద్యోగ యువతకు అవసరమైన కోచింగ్ మెటీరియల్ ఉచితంగా అందించాలని సూచిం చారు. టెట్ పరీక్షను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.