Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన శనివారం సంతకం చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఆదివారం లేదా సోమవారం వెలువడే అవకాశమున్నది. ఇప్పటికే ఎండల తీవ్రత ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఒంటిపూట బడులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. మధ్యాహ్న భోజనం అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్నం 12.30 గంటలకు అందిస్తారు. వచ్చేనెల 23వ తేదీ పాఠశాలలకు చివరి పనిదినమని అకడమిక్ క్యాలెండర్లో ప్రభుత్వం ప్రకటించింది. అదేనెల 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులుంటాయని తెలిపింది.