Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాన్ని రాజకీయంగా వాడుకుంటున్నా అభివృద్ధిని నిధులివ్వని కేంద్రం
- అసెంబ్లీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తామని క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తున్నదని వివరించారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం నిర్మిస్తామన్నారు. ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని చెప్పారు. స్పోర్ట్స్ స్కూళ్లను పెంచుతామనీ, స్పోర్ట్స్ అకాడమిలను జిల్లాలకు విస్తరిస్తామని అన్నారు. హెచ్‌సీఏ పాలకమండలి ఇష్టానుసారంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. క్రీడలు, విద్యాశాఖ కలిసి పీఈటీల ద్వారా విద్యార్థులను ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రతి పాఠశాలకూ అనుబంధంగా ప్రభుత్వ భూమిలో మైదానాలను అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో సెట్విన్ ఎలక్ట్రిక్ బస్సులను తెస్తామని అన్నారు. ప్రపంచస్థాయిలో ఖ్యాతి వచ్చేలా రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని వివరించారు. గోల్ఫ్ కోర్టును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. బుద్ధవనం ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలంటూ గతంలో సీఎం కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు గుర్తించడం లేదన్నారు. కానీ రాజకీయంగా ఈ రాష్ట్రాన్ని బీజేపీ వాడుకుంటున్నదని వివరించారు. అభివృద్ధికి మాత్రం కేంద్ర ప్రభుత్వం నిధులివ్వడం లేదని చెప్పారు.