Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంగన్వాడీ, ఆశ కార్మికులకు వేతనాలు పెంచినట్టుగానే..మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఎంతో కొంత వేతనాలు పెంచాలని టీఆర్ఎస్ సభ్యుడు గ్యాదరి కిశోర్ విజ్ఞప్తి చేశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా విద్యారంగంపౖౖె ఆయన మాట్లాడారు. స్కావెంజర్లు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ఏ మేరకు వీలైతే ఆ మేరకు పరిష్కరించాలని సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఆరోగ్య తెలంగాణతోనే..బంగారు తెలంగాణ సాధ్యం :మెతుకు ఆనంద్
ఆరోగ్య తెలంగాణ తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని టీఆర్ఎస్ సభ్యుడు మెతుకు ఆనంద్ తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు, అవయవాల మార్పిడి, శస్త్ర చికిత్సలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. కళ్యాణ లక్ష్మితో బాల్యవివాహాలు చాలా వరకు తగ్గాయనీ, తద్వారా యువతుల్లో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టాయన్నారు.