Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సస్పెన్షన్‌పై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ శాసనసభ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై స్టే ఇవ్వడానికి సింగిల్ జడ్జి నిరాకరించడంతో వారు శనివారం అత్యవసర హౌస్‌మోషన్ పేరిట అప్పీల్ పిటిషన్లను దాఖలు చేశారు. ఈనెల 15వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయనీ, ఈ క్రమంలో సభకు హాజరయ్యేలా సస్పెన్షన్ తీర్మానంపై స్టే ఇవ్వాలని ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్‌లు అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేయనుంది.