Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో వారి ఖాతాల్లోకి జమ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయ హస్తం నిధులను ఆ మహిళలకు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు రూ 545 కోట్ల రూపాయలను పొదుపు చేసుకున్నారని పేర్కొన్నారు. అప్పట్లో అభయ హస్తం కింద రూ.500 కంట్రిబ్యూటరీ పెన్షన్ కోసం పొదుపు చేశారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, ఆసరా పథకం కింద మొదట్లో వెయ్యి రూపాయలు, ఇప్పుడు రూ.2016 మొత్తాన్ని పెన్షన్‌గా ఇస్తున్నదని గుర్తు చేశారు. అప్పటి కంటే ఇప్పుడు అధిక మొత్తంలో పెన్షన్ వస్తున్నందున మహిళలు సైతం అభయ హస్తం డబ్బులు తమవి తమకు కావాలని అడుగుతున్నారని వివరించారు. మహిళల విజ్ఞప్తిమేరకు ఆ నిధులను వారికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఆ నిధిని ఆయా మహిళల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించినట్టు తెలపారు.దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు.