Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టెక్ మహీంద్రా ఫౌండేషన్ సహకారంతో నియో కర్సర్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నది. యువకులకు ఉచిత బ్యాంకింగ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్, స్పోకెన్ ఇంగ్లీష్ ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ కాన్సెప్ట్, అడ్వాన్స్ ఎక్సెల్ రంగాల్లో నాలుగు నెలలు శిక్షణ ఇచ్చి 100శాతం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నది. శిక్షణ తీసుకునేవారి వయో పరిమితి 18 నుంచి 30 సంవత్సరాలుండాలి. ఇంటర్, డిగ్రీ పూర్తిచేసినవారికి శిక్షణ ఇవ్వనున్నట్టు నియో కర్సర్ సంస్థ ప్రతినిధి నాగ వర్మ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణా తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7799694242, 7799594242. చిరునామా.. సోనీ బిజినెస్ కాంప్లెక్స్, ప్రశాంత్ నగర్ కూకట్పల్లి.