Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థినులను వేధించిన లెక్చరర్
- కోదాడ కేఆర్ఆర్ జూనియర్ కళాశాలలో
- ఆలస్యంగా వెలుగులోకి..
నవతెలంగాణ-కోదాడరూరల్
ధ్యాపక వృత్తిలో ఉంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకుడు కళాశాల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ ఘటన కోదాడ పట్టణంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 15 రోజులుగా సైన్స్ ప్రయోగ పరీక్షలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో పరీక్షలకు హాజరైన విద్యార్థినుల పట్ల కళాశాల అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాలికలు లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బోర్డు అధికారులు కళాశాలలో విచారణ జరిపారు. విషయం వెలుగులోకి రాకుండా కొందరు మధ్యవర్తిత్వం వహించినట్టు సమాచారం. బోర్డు అధికారులు సదరు అధ్యాపకున్ని హెచ్చరించి ప్రవర్తన మార్చుకోవాలని సూచించినట్టు సమాచారం. కాగా సదరు అధ్యాపకుడు సెలవుపై వెళ్ళాడు. పూర్తిస్థాయి విచారణ ముగిసిన తర్వాత చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు.