Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజారోగ్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ఆదివారం హైదరాబాద్లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ముడు గంట ల వరకు ప్రజారోగ్య పరిరక్షణ సభను నిర్వహిస్తున్నట్టు హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ)అధ్యక్షులు డాక్టర్ కె.మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో రెగ్యులర్ నియామకాలు, ప్రాథమిక వైద్యం నిర్లక్ష్యం, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవన సమస్య, ఇన్ఛార్జీల అడ్మినిస్ట్రేషన్, నకిలీ వైద్యుల సమస్య-మెడికల్ కౌన్సిల్ సభ్యుల నియామకం, ప్రభుత్వ ఆస్పత్రులకు ఎస్పీఎఫ్ భద్రత అనే అంశాలను చర్చించనున్నారు. వక్తలుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రాష్ట్ర మాజీ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎం.కోదండరామ్ పాల్గొననున్నారు.