Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రిలో 9వ రోజు బ్రహ్మోత్సవాలు
నవతెలంగాణ-యాదాద్రి
యాద్రాది వార్సిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు శనివారం శ్రీమహావిష్ణువుగా గరుఢవాహన అలంకార సేవలో స్వామివారు బాలాలయంలో సందర్శకులకు దర్శనమిచ్చారు. మహావిష్ణువు ప్రతినిధి, వేద స్వరూపునిగా పూజలు అందుకొని గరుత్మంతునిపై మధ్యహ్నం శ్రీలకీë సమేతుడిగా కనిపించారు. యాగశాలలో హవనం, పారాయణాలు గావించారు. స్థానిక వైష్ణవ సేవ సమాఖ్య వారిచే ప్రభాతభేరీ, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం ఉదయం నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో నిత్యహోమం, పారాయణాలు పంచ సూక్తములు, మూల మంత్రజపాలు నిర్వహిం చారు. యాజ్ఞికులు, ప్రదానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహ చార్యులు, మోహనచార్యులు అర్చకబృందం ఉత్సవాలు నిర్వహించగా ఉత్సవ పెద్దలుగా ఆలయ ఇన్చార్జి ఈవో ఎన్ గీతా, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఏఈవోలు దోర్భల భాస్కరశర్మ, గట్టు శ్రావణ్ కుమార్, గజివెల్లి రమేష్‌బాబు, దూశెట్టి క్రిష్ణ, వేముల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.