Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచక్షణారహితంగా చితకబాదిన వైనం
నవతెలంగాణ-కొత్తగూడ/గంగారం
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పుట్టల భూపతిలో
పోడురైతుపై అటవీ శాఖ అధికారులు శనివారం కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. గ్రామ సమీపంలోని వేంపల్లిపాడు ప్రాంతంలో అటవీశాఖ అధికారులు కందకం పనులు చేపట్టగా పోడు రైతు సోలం బాబు అడ్డుకున్నాడు. తనకు జీవనాధారమైన ఆ భూమిని లాక్కుంటే ఎలా బతకాలంటూ ట్రెంచ్ పనులకు భార్యతో కలిసి అడ్డుపడ్డాడు. దీంతో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది బాబు దంపతులను కర్రలతో చితకబాదారు. అనంతరం వారిని అటవీ శాఖ జీపులో బలవంతంగా ఎక్కించుకుని కొత్తగూడ మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తీసుకెళ్లారు. బాబును రేంజ్ కార్యాలయంలోని గదిలో బంధించి రెండు కాళ్లపైనా విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో బాబు సొమ్మసిల్లి పడిపోగా కుటుంబీకులకు సమాచారం ఇచ్చి స్వగ్రామానికి పంపించారు.