Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా జూపాక, మహేష్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీయస్యూ) రాష్ట్ర అధ్యక్షులుగా జూపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆదివారం ఒక ప్రకటనలో ఆ సంఘం నేతలు తెలిపారు. ఓయూలో జరిగిన రాష్ట్ర స్థాయి నిర్మాణ జనరల్ బాడీలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు తెలిపారు. ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ , కిరణ్, శ్రీకాంత్ గడ్డం శ్యామ్, రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ఆర్ గౌతమ్ కుమార్, తిరుపతి, నూనె సురేష్, చరణ్, వినోద్ తో పాటు 29 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకొన్నారు.