Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా
- నేడే చలో అసెంబ్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కెేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదనీ, మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వ విధానాలకు నిరసనగా సోమవారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 14లక్షల మందికి ఆసరా పింఛన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీడీ,ఒంటరి మహిళలు, చేనేత, వికలాంగులు, బోదకాలు భాదితులు, తదితర అర్హత కలిగిన వారికి పింఛన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 57 ఏండ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ ఆసరా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలనీ, రేషన్ కార్డులు మంజూరు చేయాలని, పోడు భూములకు పట్టా హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.