Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్
నవతెలంగాణ-హుజూర్ నగర్ టౌన్
రాష్ట్రంలో యువత ఎదుర్కొ ంటున్న సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ పిలుపుని చ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని జీవీపీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ అధ్యక్షతన రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలు ఆదివారం ముగిసాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంలో భారీగా నియామకాలుంటాయని చెప్పిన పాలకులు.. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పై చదువులు చదివి పట్టాలు చేతిలో పట్టుకొని అనేక మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇటీవల ప్రభుత్వ ప్రకటనతో కొంత ఊరట వచ్చినా ప్రకటించిన ఉద్యోగాల భర్తీ చేస్తారో లేదో అనే భయంతో యువత ఉన్నారన్నారు. ఇప్పటికైనా ఉద్యోగాలు రాక ఉపాధి లేక నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న యువతకు.. ప్రకటించిన ఉద్యోగాల ప్రకటన వరకే పరిమితం కాకుండా రాష్ట్రంలో బిస్వాల్ కమిటీ ఇచ్చిన సర్వే నివేదిక ప్రకారం 1,91,126 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. 2018 నుంచి ఇప్పటివరకు 50 మంది నిరుద్యోగులు చనిపోయారని, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్సిగ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేయాలని తీర్మానం చేశారు. అలాగే, తీసివేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను, ఇతర ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత కోచింగ్ సెంటర్ ను వెంటనే ప్రారంభించి పోటీ పరీక్షలకు వస్తున్న యువతకు ఉచిత భోజన వసతి కల్పించాలని తెలిపారు. పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. సమావేశంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు బషీరుద్దీన్, నవీన్, లిక్కి బాలరాజు, గడ్డం వెంకటేష్, రాజు, మల్లం మహేష్, శివవర్మ, జిల్లా కార్యదర్శి తిరుపతి, నవీన్ , సదా మూర్తి, నరేష్ పటేల్, శ్యామ్ రావు, వి. సైదులు, ప్రవీణ్, జావిద్, హరికృష్ణ, బాలు, చిన్న, నాగారపు పాండు, పల్లె వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.