Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతదేశంలో అగ్రశ్రేణి ట్రావెల్స్ సంస్థ అయిన సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి కృష్ణమోహన్ కుమార్తె దివ్య వివాహ రిసెప్షన్ శనివారంనాడిక్కడ ఘనంగా జరిగింది. మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ డైమెండ్ హాల్లో జరిగిన ఈ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వధూవరులు దివ్య-శుభమ్‌లను అశీర్వదించారు. అత్యంత శోభాయమా నంగా జరిగిన రిసెప్షన్ వేడుకకు వచ్చిన ఆహూతులను ఆలపాటి కుటుంబసభ్యులు సాదరంగా ఆహ్వానించి, ఆతిధ్యమిచ్చారు. నూతన దంపతులు కలకాలం సంతోషంగా ఉండాలని ఆతిధులు దీవించారు.