Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల శుభాకాంక్షలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చాలిచ్చి ఆశీర్వదించారు.వివిధ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లపంపిణీ చేశారు. అరేబియా సముద్రంలో ఓ అభిమాని బోట్లలో ఆమె ప్లెక్సీలను ప్రదర్శించి తన అభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా గత నాలుగు రోజులుగా ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేకేఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. అందులో 'రేయంచి' టీమ్ విజేతగా నిలిచింది. ఆ టీమ్‌కు లక్ష రూపాయల నగదును బహుమతిగా రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన 'రాయోలిన' టీమ్‌కు రూ 50వేల రూపాయల నగదు పురస్కారం అందించారు. అనంతరం క్రీడాకారులు, టీఆర్ఎస్వీ నాయకులతో కలిసి మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కవితమ్మ జన్మదినం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషకరమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం నడుస్తున్న సమయంలో తండ్రి కేసీఆర్‌కు తోడుగా రాష్ట్రాన్ని సాధించుకోవాలనే సంకల్పంతో అమెరికా నుంచి వచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, టోర్నమెంట్ నిర్వహుకులు టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత శ్రీకుమార్, అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పలువురు నాయకులు పాల్గొన్నారు.