Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శాసనమండలి చైర్మన్ పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం శాసనమండలిలో అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ మండలి చైర్మన్‌గా తనకు రెండోసారి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నిక కావ డానికి ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పక్షాల సభ్యులకు ధన్యవాదాలు తెలి పారు. గతంలో మాదిరిగా మండలిని హుందాతనంగా నడిపేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే కోటా నుంచి శాసనమండలికి ఆయన ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికయ్యారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మంత్రులు జగదీష్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.