Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.మూడు వేల కోట్లు కేటాయించాలి:
- టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ
నవతెలంగాణ- ఖమ్మం
రాష్ట్ర ప్రభుత్వం మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి 2022-23 సంవత్సర బడ్జెట్లో కేవలం రూ.187 కోట్లు మాత్రమే కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని, బడ్జెట్ను సవరించి రూ.3 వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం (టీఎంకేఎంకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీవీకే భవన్లో సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహా అధ్యక్షతన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంలో మత్స్య సొసైటీలకు చేప పిల్లలు, రొయ్య పిల్లలు ఇవ్వడం వల్ల పెద్ద ఎత్తున మత్స్య సంపద 5 లక్షల టన్నులు పెరిగిందని గొప్పలు చెప్పుకుంటున్నదని, కానీ వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల మత్స్యసంపద రోజు రోజుకు తగ్గిపోతుందన్నారు. ఉచితచేప, రొయ్య పిల్లలు పథకం పాలకవర్గాలకు కొద్దిమంది అవినీతి అధికారులు, దళారులకు వరంగా మారిపోతుందన్నారు. మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరుగు తుందన్నారు. పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మత్స్యకారుల 3 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని, గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులు, కుంటలపై వేస్తున్న అధిక లీజులను వెంటనే తగ్గించాలని, గతంలో గ్రామ పంచాయతీలు బహిరంగ వేలం వేస్తే మత్స్యకారులు నష్టపోయారని, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన 268 జీఓ వల్ల మంచి జరుగుతుందని, భవిష్యత్ మత్స్య శాఖ అధికారులు కూడా ఎక్కువ మొత్తంలో లీజులను అరికట్టాలని నోటీసులు పంపటం సిగ్గు చేటన్నారు. వెంటనే లీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు.