Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది జిల్లాల వరప్రదాయిని మల్లన్నసాగర్ :హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గతంలో బీడు వారిన భూములు ఇప్పుడు పచ్చగా కలకలలాడుతున్నాయనీ, అవసరమైన ప్రతి చోట ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతంగా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. నీటి ప్రాజెక్టులు, ఆయకట్టు అభివృద్ధికి సంబంధించిన పద్దుపై సోమవారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సమాధానం చెబుతూ గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పచ్చ కళ్లద్దాలతో చూస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులు ఆనాడే కట్టుంటే..ఈ నాడు రాష్ట్రం సస్యశ్యామలమయ్యేదని చెప్పారు. తెలంగాణలో జరిగిన ఘోరాలకు, అన్యాయాలకు కాంగ్రెసే బాధ్యత వహించాలని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సోయితో ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిద్దా? కమీషన్లకోసమే ఈ ప్రాజెక్టు కడుతున్నారని ఎద్దేవా చేయటమే కాక, ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా విమర్శలు చేశారని గుర్తుచేశారు.