Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర్మపురి అరవింద్‌ను ఉరికించినట్టు ఉరికిస్తారు..
- కాంగ్రెస్ మ్యూజియంలో ఉండబోతుంది :
- రేవంత్‌రెడ్డిపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఫైర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
'జైల్లో చిప్ప కూడు తిన్నాక రేవంత్‌రెడ్డి చిన్నమెదడు చిట్లింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మ్యూజియంలో ఉండబోతుంది. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్‌రెడ్డి సానుభూతి అవసరం లేదు. నువ్వు నల్లమల్ల బిడ్డవైతే ప్రజలు ఎందుకు ఓడగొట్టారు. మీది స్కాముల పార్టీ.. మాది స్కీముల పార్టీ' అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. 90వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని, దీంతో యువత బంగారు తెలంగాణలో భాగం కాబోతున్నారని అన్నారు. ''వచ్చే ఎన్నికల్లో నువ్వు ఉండవు.. నీ ఓటమి కేసిఆర్ చూస్తారు. నల్లమల బిడ్డవు కాదు.. నువ్వు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగవని'' విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డిని ఆయన పార్టీనే నమ్మదని, ఏం మాట్లాడుతారో ఆయనకే తెలువదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని, పొద్దున ఒక స్టేట్మెంట్, సాయంత్రం మరొక స్టేట్మెంట్ ఇస్తారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ దాటదని విమర్శించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే ధర్మపురి అరివింద్ను ఎలా ఉరికించి కొట్టారో.. తమరిని కూడా అలాగే రైతులు ఉరికించి కొడతారని హెచ్చరించారు.