Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ది తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ (అమెండ్మెంట్) బిల్- 2022ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్ రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సభ ఆమోదించింది. ఈ ఏడాదికి ఎఫ్ఆర్బీఎం పరిమితిని నాలుగు శాతానికి, వచ్చే ఏడాదికి ఐదు శాతానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరుతూ సవరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో 23 రాష్ట్రాల కన్నా తెలంగాణ అప్పులు తక్కువగా చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు చేశాయని విమర్శించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఇప్పటికే అప్పులపాలైన రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేయొద్దని సూచించారు.
పలు పద్దులకు ఆమోదం
అసెంబ్లీ సోమవారం పలు పద్దులను ఆమోదించింది. సాధారణ పరిపాలనా,పంచాయతీరాజ్,రోడ్లు,భవనాలు,శాసనసభా వ్యవహారా లు, హౌజింగ్, విద్యుత్తు, న్యాయశాఖ పద్దులు వీటిలో ఉన్నాయి.