Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో హౌంమంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పెరుగుతున్న జనాభా, పట్టణీ కరణ, నేరాల నేపథ్యంలో అవసర మైన చోట్ల పోలీస్టేషన్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని హౌంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. పోలీసు శాఖ ఆధునీకరణపై సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, ఎస్ రాజేందర్రెడ్డి, రవిశంకర్ సుంకె, అహ్మద్ బలాల తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ టీవీల సంఖ్యలో, తెలంగాణలోనే 68 శాతం ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ఫైర్ స్టేషన్ల ఏర్పాటుపై హామీ ఇచ్చారు. సైదాబాద్ పోలీస్టేషన్ నిర్మాణం, ఏసీపీ కార్యాలయ నిర్మాణానికి జైళ్లశాఖ స్థలం కేటాయింపు అంశాలను పరిశీలిస్తామన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీస్టేషన్లకు కూడా దరఖాస్తులు చేసుకుంటే పరిశీస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.