Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో వ్యవసాయమంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి జిల్లాలో మాత్రమే ఈ తరహా పరిశోధన కేంద్రం ఉన్నదనీ, దాన్ని రాష్ట్రంలో అనువైన ప్రాంతంలో 200 ఎకరాల భూమి కేటాయించి నెలకొల్పుతామని తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు బల్క సుమన్, సండ్ర వెంకట వీరయ్య, యెల్గనమోని అంజయ్య, గండ్ర వెంకట రమణారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. ఆయిల్‌పామ్ మొక్క నాటడానికంటే ముందు 16 నెలల ప్రాసెస్ ఉంటుందనీ, ప్రస్తుతం 2.20 లక్షల ఎకరాలకు సరిపడా మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. కోవిడ్ వల్ల పంట విస్తరణకు అవాంతరాలు ఏర్పడ్డాయని చెప్పారు. డ్రిప్‌కు అవసరమైన సబ్సిడీ సొమ్మును పెంచుతామని హామీ ఇచ్చారు. అటవీశాఖకు చెందిన ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో కూడా ఈ పంటను పెంచేందుకు అనుమతులు ఇవ్వడంపై ఆ శాఖ అధికారులతో సమావేశమవుతామన్నారు. గిరిజనులకు పాస్ పుస్తకాలు లేకపోవడంతో సబ్సిడీ ఆయిల్‌పామ్ మొక్కలు, డ్రిప్ సౌకర్యాలు లభించట్లేదని అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు సభ దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీనిపై మంత్రి సమాధానం చెప్పలేదు. డ్రిప్‌కు ఇచ్చే సబ్సిడీ సొమ్మును సకాలంలో కంపెనీలకు చెల్లిస్తే, సేవలు మెరుగవుతాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. విదేశాల నుంచి విత్తనాలు దిగుమతి చేసుకొని, 16నెలల ప్రాసెస్ పూర్తయిన నాలుగేండ్ల తర్వాతే ఈ పంట చేతికి వస్తుందనీ, అప్పటి వరకు అంతరపంటలు వేసుకోవచ్చని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ఆయిల్ఫెడ్తో పాటు 11 కంపెనీలను అధీకృతం చేశామనీ, త్వరలో వారు కార్యాచరణ ప్రారంభిస్తారని తెలిపారు. సత్తుపల్లిలో పామాయిల్ కంపెనీ ఏర్పాటును పరిశీలిస్తామన్నారు.