Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ విద్యా వేత్త, సామా జిక కార్యకర్త, కేఐఐటీ, కిస్ వ్యవ స్థాపకులు డాక్టర్ అచ్యు త సామంతకు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న ఆర్కే విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకమైన గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. గిరిజన విద్యార్థుల సాధికారత కోసం నాణ్యమైన విద్య అందించేందుకు విశేషంగా కృషి చేస్తున్నందున ఆయనకు ఈ డాక్టరేట్ వరించింది. వారి ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, కళలు, సంస్కృతి, సాహిత్యం వంటి అంశాలపై ఆయన పనిచేశారు. ఈనెల 12న ఆర్కే విశ్వవిద్యాలయం తొమ్మిదో స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఆర్కే వర్సిటీ చాన్సలర్ డాక్టర్ టీఆర్ దేశాయి, అధ్యక్షులు కొదిదాస్భారు పటేల్‌కు ఆయన ధన్యవాదాలు ప్రకటించారు.