Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) కొత్తగా జోగులాంబ జిల్లా గద్వాల్లో తన నూతన శాఖను ఏర్పాటు చేసింది. దీన్ని ఎంఎల్ఏ క్రిష్ణ మోహన్ రెడ్డి. జిల్లా కలెక్టర్ షేక్ యస్మీన్ లాంచనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో బీఓఎం హైదరాబాద్ జోన్ జోనల్ మేనేజర్ ఆర్ జగన్ మోహన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమకు 18 జిల్లాల్లో 40 శాఖలున్నాయని బీఓఎం తెలిపింది. అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్టు పేర్కొంది. జోగులాంబలో నూతన శాఖను తెరవడం తమకెంతో సంతోషంగా ఉందని జోనల్ మేనేజర్ జగన్ మోహన్ పేర్కొన్నారు. తమకు దేశ వ్యాప్తంగా 2.7 కోట్ల మంది ఖాతాదారులున్నారన్నారు.