Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ఖమ్మంరూరల్
ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలం ముత్తగూడెం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుమలాయపాలెం మండలం నవతెలంగాణ విలేకరి దోనేపల్లి వెంకన్న(47) పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందారు. మండలంలోని జూపెడ గ్రామానికి చెందిన వెంకన్న స్వగ్రామం నుంచి ఖమ్మం వస్తుండగా ముత్తగూడెం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు గాయమై ఖమ్మంలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందాడు. వెంకన్నకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకన్న స్వగ్రామం జూపెడ గ్రామంలో అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. ఖమ్మంరూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భౌతికకాయాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, వై.విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు నవీన్‌రెడ్డి, బండారు రమేష్, బండి పద్మ, నవతెలంగాణ జనరల్ మేనేజర్ ఎం.సుబ్బారావు, రీజనల్ మేనేజర్ జావేద్ తదితరులు సందర్శించి నివాళ్లర్పించారు. టీయూడబ్య్లూజే(ఐజేయు) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆదినారాయణ, ఇస్మాల్, రాష్ట్ర నాయకులు రామ్ నారాయణ, ఏనుగు వెంకటేశ్వర్లు సంతాపం తెలిపారు.