Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంకెన్నాళ్లు మత రాజకీయాలు
- దేవుడు, మిలటరీ పేర్లు చెప్పి ఓట్లు అడుగుతారు
- దమ్ముంటే డిఫెన్స్ నుంచి పర్మిషన్ తీసుకుని రావాలి
- కిషన్ రెడ్డి, బండి సంజరుకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సవాల్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంకెన్నాళ్లు మత రాజకీయాలు చేస్తారని, దేవుని పేరుచెప్పి ఓట్లు అడుగుతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏమైనా మీ తాత జాగీరా.. మోడీ జాగీరా? అంటూ నిలదీశారు. ప్రజల సమస్యలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. తాము 100 మంది ఎమ్మెల్యేలం ఉన్నామని, తాము కూడా 'ఒరేరు బండి సంజరు' అనగలం కానీ, అలా మాట్లాడటం తమ సంస్కారం కాదన్నారు. కంటోన్మెంట్ ఎన్నికలు రాబోతున్నాయని, అప్పుడు చూసుకుందామని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు సాయన్న, వివేకానంద గౌెడ్, మాగంటి గోపినాథ్ మాట్లాడారు.
బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీని తరిమికొట్టే రోజులు వస్తాయన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. కంటోన్మెంట్ రహదారి మూసేయడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో కలపాలని ప్రజలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారన్నారు. కంటోన్మెంట్ సమస్యను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని, దీనికితోడు కేంద్ర రక్షణశాఖ ఆంక్షలు పెడుతోందని అన్నారు.
దమ్ముంటే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు అనుమతులు తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజరు టీఆర్ఎస్పై అనుచిత వాఖ్యలు చేస్తున్నారని, కంటోన్మెంట్ గురించి బండికి ఏం తెలుసని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో వరద బాధితులకు వాహనం పోతే వాహనం ఇస్తామని చెప్పిన బండి సంజరు ఎందుకు ఇవ్వలేదన్నారు. తెలంగాణను సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని, రైతులను ఆదుకుంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.