Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందశాతం మ్యానిఫెస్టో అమలు : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
'కోమటిరెడ్డి బ్రదర్స్ మూడు రంగులు, ఆరు పార్టీలుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోడీని కలిసి మెప్పు పొంది బీజేపీలో చేరాలని చూస్తున్నారు. ఆ బ్రదర్స్‌ను ఎర్రగడ్డ ఆస్పత్రికి పంపించాలి. కేసీఆర్ వందకు వంద శాతం మ్యానిఫెస్టో అమలు చేశారు. అందుకే కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఏం మాట్లాడాలో అర్థం అయితలేదు' అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. బొగ్గు గనిలో రూ.50 వేల కోట్ల కుంభకోణం జరగబోతుందని కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రచారం చేస్తున్నారని, ఇది నిజమైతే కేంద్రం చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆరుగురు ఆరు రకాలు మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. అమర్ సింగ్‌ను ఆనాడు జైలుకు పంపితే.. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఈ గతి వచ్చేది కాదని నిన్న సోనియాగాంధీ మీడియాతో అన్నారని గుర్తుచేశారు. బీజేపీ ఎమ్మెల్యేలకు ఆర్ఆర్ఆర్ అని పేరు పెట్టారని, ఒకరు రెచ్చగొట్టడం, ఒకరు రచ్చ చేయడం, ఒకరు రెచ్చిపోవడమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అంటే కరప్షన్ మ్యాన్, టీఆర్ఎస్లో కామన్ మ్యాన్ అన్నారు.
రాజగోపాల్‌రెడ్డిని అగౌరవ పరిచారు : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నిస్తున్న రాజగోపాల్‌రెడ్డిని కాంట్రాక్టర్ అని టీఆర్ఎస్ నేతలు అవమానించారని, సభ్యున్ని, సభా గౌరవాన్ని తగ్గించారని సీఎల్పీ నేత భట్టి విక్రరమార్క అన్నారు. విషయం డైవర్ట్ చేయడానికే కాంట్రాక్టర్ అని సంబోధించారని అన్నారు. ప్రజలకు నిజాలు తెలువకుండా చేస్తున్నారని, అధికారపార్టీ సభ్యులు అందరూ ఒకేసారి మాటల యుద్దానికి దిగుతున్నారని, ఇది మంచి పరిణామం కాదన్నారు.
ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న..: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి
తలసాని శ్రీనివాస్‌యాదవ్ పదే పదే రాజగోపాల్‌రెడ్డిని మాట్లాడకుండా కాంట్రాక్టర్ అనడం ఖండిస్తున్నాం. టీఆర్ఎస్లోలో కాంట్రాక్టర్లు లేరా? వాళ్లు కోటీశ్వరులు ఎలా అయ్యారు?. రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టర్ అనేది జగం ఎరిగిన సత్యం. భవిష్యత్‌లో ఇలానే అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.. రాజగోపాల్‌రెడ్డికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలి.
ఒక్క గొంతును నొక్కడానికి.. వంద గొంతులు : ములుగు ఎమ్మెల్యే దాసరి అనసూయ(సీతక్క)
సభలో ఒక్క గొంతును నొక్కడానికి వంద గొంతులు లేస్తున్నాయి. ప్రజల సమస్యలు మాట్లాడితే గొంతు నొక్కుతున్నారు. ఇక్కడి సంపద ఇక్కడి ప్రజలకు చెందాలని తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ జరుగుతున్నదేంటి..? విద్యను వ్యాపారం చేస్తున్న మంత్రులు, ఎంపీలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.. వారి ప్రస్తావన ఎందుకు ఉండటం లేదు..? నీటిపారుదల శాఖ, బొగ్గు టెండర్లలో జరిగిన అవకతవకలను ప్రశ్నిస్తున్నారని కాంట్రాక్టర్ అనడం సమాజసం కాదు. సభలో ఏ వ్యక్తి గౌరవానికీ భంగం కలిగినా ఊరుకోబోం.. సభా మర్యాద కాపాడాలి. మా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని కాంట్రాక్టర్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.