Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాపారులకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గడ్డిఅన్నారం మార్కెట్‌ను ఈ నెల 18 వరకు కొనసాగించాలని, ఆ తర్వాత మార్కెట్‌ను బాటసింగారానికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. అ ప్రదేశంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను హైకోర్టు కొనియడాడింది. మార్కెట్ నుంచి వ్యాపారుల సామాన్లు తీసుకునేందుకు మాత్రమే అనుమతించాలనీ, వ్యాపారలావాదేవీలకు అనుమతించరాని స్పష్టం చేసింది. ఈ మేరకు పిల్‌ను చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణకు మార్కెటింగ్ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దర్మహర్ష, పర్సన్ ఇన్చార్జి లక్ష్మణుడు, మార్కెట్ కమిటీ సెక్రటరీ నరసింహారెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు.