Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఆర్ఎంబీకి సాగునీటిశాఖ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గురురాఘవేంద్ర సాగునీటి ప్రాజెక్టుతో సహా మరో 13 ఎత్తిపోతల పథకాలను వెంటనే ఆపాలని తెలంగాణ సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ కేఆర్ఎంబీ చైర్మెన్‌కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు గత శుక్రవారం ఆయన లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా తుంగభద్ర నది నుంచి గురురాఘవేంద్ర సహా 13 చిన్న తరహా ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి ఏపీ సర్కారు శ్రీకారం చుట్టిందని లేఖలో పేర్కొన్నారు. ఈ పథకాలు రాజోలిబండ, సుంకేశుల బ్యారేజీ కిందిభాగంలో ఉన్నాయని స్పష్టం చేశారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రజలశక్తి శాఖ నుంచిగానీ, సీడబ్ల్యూసీ నుంచిగానీ అనుమతులు తీసుకోలేదని వివరించారు. తుంగభద్ర నది నుంచి అక్రమంగా 5.373 టీఎంసీలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నదని తెలియజేశారు. తుంగభద్ర నదీ నుంచి తీసుకెళ్లే నీటిని ఈ సాగునీటి సంవత్సరానికి సంబంధించి నీళ్లలో భాగంగానే లెక్కించాలని సూచించింది. ఈమేరకు వెంటనే కచ్చితమైన చర్యలు తీసుకోవాలని సాగునీటిశాఖ విజ్ఞప్తి చేసింది.