Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మనుషుల మధ్యే కాదు.... దేవుళ్ల మధ్య కొట్లాట పెట్టే పరిస్థితి బాగా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, యాదాద్రిని పట్టించుకున్నట్టే వేములవాడను కూడా పట్టించుకుని నిధులు విడుదల చేయాలని కోరారు. అనంతరం బిల్లుపై కవిత మాట్లాడుతూ, శ్రీలక్ష్మి నరసింహస్వామికి, వేములవాడ రాజ రాజేశ్వరస్వామికి మధ్య గొడవ పెట్టాలని చూడొద్దని సూచించారు. ఇప్పటికే వేములవాడకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు. చిన్న, కొత్త రాష్ట్రమైనా తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా మారిందని కవిత అన్నారు.
నేడు ఖైరతాబాద్ సీహెచ్‌సీకి హరీశ్ రావు
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం ఖైరతాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించనున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. జాతీయ వ్యాక్సినేషన్ డే సందర్భంగా 12 ఏండ్ల నుంచి 14 ఏండ్ల మధ్య వారికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.