Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీసవేతనం ఇచ్చే దిశగా సర్కారు ఆలోచించాలి : ఎస్వీ రమ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మధ్యాహ్న భోజన కార్మికుల పారితోషికాన్ని రూ.3 వేలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ ప్రవీణ్‌కుమార్, ఎస్వీ రమ తెలిపారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. వెయ్యి రూపాయల నుంచి రూ.3 వేలకు పెంచడం ఒకింత సంతోషకరమే అయినప్పటికీ పెరిగిన నిత్యావసరాల ధరలు, ఇతరత్రా ఖర్చుల నేపథ్యంలో దాంతో ఒక కుటుంబం ఎలా బతుకుతుందని ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం ఇచ్చే దిశగా సర్కారు ఆలోచించాలని కోరారు. వారానికి మూడు గుడ్ల కోసం ఇస్తున్న డబ్బులు సరిపోవట్లేదనీ, వాటిని కూడా పెంచాలని విన్నవించారు.