Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్‌కు పండిత, పీఈటీల ఐక్యవేదిక వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పండితులు, పీఈటీల పదోన్నతులకు అనుకూలంగా ప్రభుత్వం జారీ చేసిన రెండు, మూడు, తొమ్మిది, పది జీవోలను అమలు చేయాలని పండిత, పీఈటీల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు మంత్రి కేటీ రామారావును మంగళ వారం హైదరాబాద్‌లో ఐక్యవేదిక నాయకులు మహమ్మద్ అబ్దుల్లా, చక్రవర్తుల శ్రీనివాస్, బి రాఘవరెడ్డి, గుల్లపల్లి తిరుమల, క్రాంతికృష్ణ, శర్మ, హమీద్‌ఖాన్, రమేష్ కలిసి వినతిపత్రం సమర్పించారు. పదోన్నతులకు అడ్డంగా హైకోర్టులో ఉన్న స్టేను ఎత్తివేయించాలని కోరారు. భాషాపండితులకు స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించాలని విన్నవించారు. అనంతరం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.